మెగాస్టార్ క్రేజీ కాంబోపై క్లారిటీ వచ్చేసిందిగా..!

Published on Feb 7, 2021 7:11 am IST

మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగస్టార్ చిరంజీవి ప్రస్తుతం బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ తో “ఆచార్య” అనే భారీ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. మరి దీని తర్వాత రెండు రీమేక్ సినిమాలను కూడా చిరు లైన్ లో పెట్టుకున్న సంగతి కూడా విదితమే.. అయితే మరీ ఈ రెండూ కాకుండా టాలెంటెడ్ దర్శకుడు బాబీతో ఒక స్ట్రెయిట్ ఫిల్మ్ ను కూడా ఒకే చేశారు.

మరి దీనిపై మరింత క్లారిటీ ను తన మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ “ఉప్పెన” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇచ్చేసారు. ఆ చిత్రంను కూడా మైత్రి మూవీ మేకర్సే తీస్తున్నారని హింటివ్వగా ఆ నిర్మాణ సంస్థ వారు కూడా దానిని కన్ఫర్మ్ చేసేసారు. సో ఫైనల్ గా ఈ క్రేజీ కాంబోను ఎవరు ప్రొడ్యూస్ చెయ్యబోతున్నారో అన్నది ఒక క్లారిటీ వచ్చేసింది..

సంబంధిత సమాచారం :

More