యంగ్ టైగర్ నెక్స్ట్ పై క్లారిటీ ఇచ్చేసిన నిర్మాత.!

Published on Mar 23, 2021 3:00 pm IST

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా దర్శక ధీరుడు రాజమౌళితో “రౌద్రం రణం రుధిరం” అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మరి అలాగే ఈ చిత్రంతో పాటుగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మరో చిత్రాన్ని ప్లాన్ చేసారు. మరి “అరవింద సమేత” చిత్రం తర్వాత ప్లాన్ చేసిన సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఎప్పుడు నుంచో ఎదురు చూస్తున్న ఈ చిత్రంకు సంబంధించి మొత్తానికి ఓ అప్డేట్ ను నిర్మాత నాగవంశీ రివీల్ చేసారు. లేటెస్ట్ గా మీడియాలో జరిపిన ఇంటరాక్షన్ మాట్లాడుతూ తారక్ మరియు త్రివిక్రమ్ ల కాంబోలో చిత్రం వచ్చే ఏప్రిల్ చివరిలో కానీ మేలో కానీ స్టార్ట్ అవ్వడం ఖాయమని కన్ఫర్మ్ చేసేసారు. సో ఈ “అయినను పోయి రావలె హస్తినకు” పై ఒక తుది క్లారిటీ వచ్చింది. ఇప్పటికే త్రివిక్రమ్ తారక్ కు తగ్గ పవర్ ఫుల్ సబ్జెక్టును ప్రిపేర్ చేసారని తెలిసింది. అలాగే హీరోయిన్స్ కూడా ఫైనల్ కానున్నారు.

సంబంధిత సమాచారం :