Peddi on Netflix: ‘పెద్ది’ ఓటిటి వెర్షన్ పై క్లారిటీ!

Peddi on Netflix: ‘పెద్ది’ ఓటిటి వెర్షన్ పై క్లారిటీ!

Published on Jul 8, 2026 12:03 PM IST

Peddi

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బాలీవుడ్ గ్లామరస్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన లేటెస్ట్ అవైటెడ్ సినిమానే “పెద్ది”. ఒక ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా సెన్సేషనల్ హిట్ అయ్యి రామ్ చరణ్ కెరీర్ లోనే కాకుండా ఈ ఏడాది టాలీవుడ్ నుంచి బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచింది.

అయితే ఈ సినిమా రేపు జూలై 9 నుంచి దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి రానున్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో పెద్ది అసలు ఏ వెర్షన్ వస్తుంది అనేది ఆసక్తిగా మారింది. థియేటర్స్ లో ముందు 3 గంటల 9 నిమిషాల నిడివితో వచ్చిన వెర్షన్ తర్వాత మేకర్స్ కొన్ని సీన్స్ తీసి మళ్ళీ కొన్ని యాడ్ చేసి 3 గంటల 5 నిమిషాలకి కుదించారు.

తర్వాత అప్డేట్ చేసిన దానికే మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ ఓటిటిలో ఏది వస్తుంది అనే సంశయంలో అభిమానులు ఉండగా వారికి ఓ క్లారిటీ ఇపుడు వచ్చేసింది. పెద్ది నెట్ ఫ్లిక్స్ లో 3 గంటల 5 నిమిషాల ప్రింట్ తో రాబోతున్నట్టు రన్ టైం పొందుపరిచారు. సో అప్డేట్ చేసిన దానితోనే రావచ్చని చెప్పొచ్చు. సో ఇది మంచి మూవ్ అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాకి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు. అలాగే వృద్ధి సినిమాస్ నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

Peddi

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు