మొత్తానికి కదులుతున్న ‘టాక్సిక్’.. రేపే బిగ్ అప్డేట్!

మొత్తానికి కదులుతున్న ‘టాక్సిక్’.. రేపే బిగ్ అప్డేట్!

Published on Jun 20, 2026 9:01 PM IST

Toxic-Movie

కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా కీయారా అద్వానీ, రుక్మిణి వసంత్ అలాగే నయనతార సహా ఇంకొందరు బాలీవుడ్ భామలు కలిసి నటించిన భారీ సినిమానే టాక్సిక్. యష్ నుంచి ఎన్నో ఏళ్ళు నుంచి ఎదురు చూస్తున్న ఈ సినిమాని మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కించిన ఈ క్రేజీ యాక్షన్ ప్రాజెక్ట్ రిలీజ్ ప్రశ్నార్థకంగా మారింది.

ఏప్రిల్ నుంచి జూన్ కి వాయిదా పడ్డ ఈ సినిమా తర్వాత మాత్రం కొత్త విడుదల తేదీని ఇప్పటికీ ఫిక్స్ చేసుకోలేదు. దీనితో ఈ అప్డేట్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ మేకర్స్ నుంచి ఎలాంటి ఉలుకు లేదు. అయితే ఫైనల్ గా మేకర్స్ ఎట్టకేలకు మళ్లీ ఆక్టివ్ అయ్యారు. రేపు జూన్ 21 సినిమాకి సంబంధించిన అప్డేట్ ఒకటి రివీల్ చేస్తున్నట్టు ఇప్పుడు కన్ఫర్మ్ చేసారు. రేపటికి సిద్ధంగా ఉండాలని అలెర్ట్ చేస్తున్నారు. సో అది రిలీజ్ డేట్ కోసమేనా లేక వేరే అప్డేటా అనేది వేచి చూడాలి.

తాజా వార్తలు