మొత్తానికి ఏ అప్డేట్ లేకుండానే ముగించేశారు.!

Published on Apr 22, 2021 9:00 am IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న పలు భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రాల్లో “ఆదిపురుష్” కూడా ఒకటి. బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కిస్తున్న ఈ భారీ ఇతిహాస గాథ చిత్రంపై ఎనలేని అంచనాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ప్రభాస్ ను శ్రీరాముని అవతారంలో చూపిస్తారన్న మాటే ఈ చిత్రంపై మంచి హై ను తీసుకొచ్చింది.

అయితే చెప్పుకోదగ్గ సమయాల్లో కాకుండా నార్మల్ టైం లోనే ఎన్నో ఆసక్తికర అప్డేట్స్ ను మేకర్స్ వదలగా నిన్న అసలైన దినం శ్రీరామ నవమికి ఖచ్చితంగా అప్డేట్ ఇస్తారు అని అంతా ఎదురు చూసారు. ముఖ్యంగా ప్రభాస్ అభిమానులు అయితే తెల్లవారు జాము నిద్రలు కూడా ఆపుకొని చూసారు. కానీ వారు అందరికీ నిరాశే మిగిలింది.

మేకర్స్ కనీసం సినిమా పేరు కూడా ఎత్తకుండా నవమి శుభాకాంక్షలు చెప్పి ముగించేశారు. ఇది డార్లింగ్ ఫ్యాన్స్ కు మరింత డిజప్పాయింట్ గా మారింది. రామునిగా ప్రభాస్ ఫస్ట్ లుక్ నో లేక హనుమాన్ గా ఎవరు చేస్తారో అన్న కీలక అప్డేట్స్ ను ఆశించగా ఏది లేకుండా మేకర్స్ సింపుల్ కంక్లూజన్ ఇచ్చారు. మరి వాటిని ఎప్పుడు రివీల్ చేస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం :