సెన్సేషనల్ “అఖండ”..రజినీ రికార్డ్ బ్రేక్.!

Published on Apr 24, 2021 5:12 pm IST

నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “అఖండ” నుంచి రిలీజ్ కాబడిన లేటెస్ట్ టీజర్ సెన్సేషన్ ఇంకా కొనసాగుతుంది. టైటిల్ ను రివీల్ చేస్తూ వచ్చిన ఈ టీజర్ బాలయ్య కెరీర్ లోనే కాకుండా మన దక్షిణాదిలో ఏ సీనియర్ స్టార్ హీరో సినిమా టీజర్స్ కు రాని రెస్పాన్స్ ను కొల్లగొట్టింది. అయితే మన సౌత్ ఇండియాలో ఇప్పటి వరకు 37.8 మిలియన్ వ్యూస్ తో తలైవర్ రజినీకాంత్ సెన్సేషనల్ చిత్రం “కబాలి” టీజర్ ఉండేది.

మరి దీని రికార్డును ఇప్పుడు బాలయ్య “అఖండ” తో 38 మిలియన్ వ్యూస్ తో క్రాస్ చేసారు. మొత్తానికి మాత్రం అఖండ టీజర్ స్పీడ్ మాములుగా లేదని చెప్పాలి. మరి ఈ చిత్రంలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు. అలాగే ద్వారకా క్రియేషన్స్ వారు ఈ సాలిడ్ మాస్ ఎంటర్టైనర్ ను నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :