మిలియన్ మార్క్ ని అందుకున్న ధృవ !
Published on Dec 14, 2016 9:20 am IST

dhruva
మొదటి రోజునుంచే హిట్ టాక్ ని అందుకున్న ధృవ చిత్రం మంచి కలెక్షన్ లని రాబడుతున్న విషయం తెలిసిందే. అభిమానులు ఎదురు చూసే మైలురాయిని ఈ చిత్రం అందుకుంది.యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ చిత్రం అమెరికాలో మిలియన్ డాలర్ల వసూళ్ళని అధికమించింది.

కాగా మిలియన్ మార్కుని అందుకున్న రాంచరణ్ తొలి చిత్రం ఇదే. ధృవ మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరిపోవడంతో అభిమానులు సంతోషాన్ని వ్యక్తంచేస్తున్నారు. మిలియన్ డాలర్ ధృవ హ్యాష్ టాగ్ ద్వారా సోషల్ మీడియా లో ట్రెండ్ చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ చిత్రం కలెక్షన్ లు స్టడీ గా ఉన్నాయి.

 
Like us on Facebook