గుడ్ న్యూస్..కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న పవన్ కళ్యాణ్.!

Published on May 8, 2021 1:07 pm IST

ఈ ఏడాది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన “వకీల్ సాబ్”తో సాలిడ్ కం బ్యాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రం సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న కొద్ది లోనే పవన్ కు కరోనా పాజిటివ్ వచ్చింది అన్న వార్త ఒక్కసారిగా ప్రతి ఒక్కరినీ షాక్ కు గురి చేసింది. ముఖ్యంగా పవన్ అభిమానుల్లో అయితే చాలా నిరుత్సాహతను తీసుకొచ్చింది.

అయితే పవన్ కు కోవిడ్ వచ్చిన మూడు రోజులకే నెగిటివ్ వచ్చింది అన్న వార్త కాస్త పర్లేదు అనిపించినా పవన్ ఆరోగ్యం మాత్రం ఇంకా కుదుట పడలేదు అని తెలిసింది. అది ఇంకా టెన్షన్ పెట్టడం పైగా తర్వాత తన పార్టీ జనసేన సోషల్ మీడియా నుంచి కూడ పవన్ ఆరోగ్యం పరంగా ఎలాంటి అప్డేట్స్ పెద్దగా ఇవ్వకపోవడం వంటివి ఇంకా విస్తు తెప్పించాయి.

కానీ ఇప్పుడు ఎట్టకేలకు పవన్ ఆరోగ్యం పట్ల అధికారిక క్లారిటీ వచ్చేసింది. పవన్ ఆరోగ్యం పూర్తిగా కుదురుకుంది అని జనసేన ప్రెస్ నోట్ వచ్చింది. కరోనా తర్వాత నిస్త్రాణంతో బాధపడుతున్న పవన్ ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకున్నట్టుగా తెలిపారు. దీనితో పవన్ తన ఆరోగ్యం కోలుకోవాలని ఆకాంక్షించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసారని ఆ ప్రెస్ నోట్ ద్వారా తెలియజేసారు. మొత్తానికి మాత్రం ఇది పవన్ అభిమానులకు గుడ్ న్యూస్ అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :