మొత్తానికి ‘వీరమల్లు’ సమయం ఆసన్నం!

మొత్తానికి ‘వీరమల్లు’ సమయం ఆసన్నం!

Published on May 15, 2025 6:00 PM IST

Hari Hara Veera Mallu

ఇపుడు మన టాలీవుడ్ సినిమా దగ్గర అవైటెడ్ గా ఎదురు చూస్తున్న స్టార్ హీరో సినిమా ఏదన్నా ఉంది అంటే అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న భారీ చిత్రం “హరిహర వీరమల్లు” అని చెప్పాలి. దర్శకుడు జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ అంతా కంప్లీట్ అయ్యాక మేకర్స్ మౌనంగా ఉండడం అనేది ఒకింత సస్పెన్స్ గా మారింది.

దీనితో గత రెండు రోజులు నుంచి పవన్ అభిమానులు ఓ అప్డేట్ కోసం చూస్తుండగా మేకర్స్ మౌనంగా ఉన్నారు. మరి ఫైనల్ గా ఈ మేకర్స్ అలెర్ట్ అయ్యారు. వీరమల్లు సమయం ఆసన్నం అయ్యింది అన్నట్టుగా రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇస్తున్నట్టు హింట్ ఇచ్చారు. దీనితో ఫైనల్ గా పవన్ అభిమానుల్లో మళ్ళీ నూతన ఉత్సాహం వచ్చినట్టు అయ్యింది. మరి ఈ రిలీజ్ డేట్ ఎప్పుడు ఏంటి అనేది వేచి చూడాలి. ఇక ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా ఏ ఎం రత్నం భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు