టాక్..ఫైనల్ గా “మహేష్ 28” స్టార్ట్ అయ్యేది అప్పుడేనా..?

Published on Aug 11, 2022 2:30 am IST

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు రీసెంట్ గానే “సర్కారు వారి పాట” అనే చిత్రంతో తన కెరీర్ లో మరో సాలిడ్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత మహేష్ ఓ వెకేషన్ ని వెళ్లి దాని తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో భారీ సినిమా ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే.

మరి ఈ సినిమాని మేకర్స్ అయితే అన్ని పనులు సెట్ చేసుకొని షూటింగ్ కి కూడా డేట్ ఫిక్స్ చేసుకున్నారు. కానీ టాలీవుడ్ లో కొన్ని రోజులు పాటు షూటింగ్స్ నిలిపివేసిన సంగతి తెలిసిందే. దీనితో అనుకున్న సమయానికి సినిమా స్టార్ట్ అవ్వొచ్చని టాక్ వచ్చింది కానీ ఇపుడు అయితే కొత్త డేట్ ఫిక్స్ అయ్యినట్టు తెలుస్తుంది.

మరి ఈ చిత్రాన్ని అయితే మేకర్స్ ఈ ఆగస్ట్ 20 లేదా 21 నుంచి షురూ చెయ్యాలని చూస్తున్నారట. మరి దీనిపై ఆధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా హారికా హాసిని వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే యాదృచ్చికంగా ఈ బ్యానర్ మొదలయ్యి పదేళ్లు కాగా తమ హీరో మహేష్ బర్త్ డే వేడుకలు కూడా ఒకే రోజున వచ్చాయి.

సంబంధిత సమాచారం :