ఫైనల్ గా తన మాస్ టేకపే రవితేజాను నిలబెట్టింది.!

Published on Jan 10, 2021 1:00 pm IST

మాస్ మహారాజ్ అనే ట్యాగ్ రవితేజాకు మాత్రమే ఎందుకు యాప్ట్ అనేది మరోసారి ప్రూవ్ అయ్యింది. గత కొంత కాలం నుంచి సరైన హిట్ మరియు కం బ్యాక్ కోసం ఎదురు చూస్తున్న రవితేజా ఫ్యాన్స్ కు మాస్ బిర్యానీతో ఫుల్ మీల్స్ పెట్టేసారు. అయితే దీనికి ముందు రవితేజా కొన్ని మాస్ అండ్ ప్రయోగాలు కూడా చేశారు.

కానీ వాటిలో కొన్ని వర్కౌట్ అవ్వలేదు. దీనితో రూట్ మార్చి కొత్త ప్రయోగం చేస్తున్నా అని “డిస్కో రాజా” చేశారు. ఆ టైం లో ఇప్పుడున్న ట్రెండ్ లో కొత్త కొత్త ప్రయోగం చేస్తే ఆదరిస్తారు అనే నమ్మకంతోనే ఆ సినిమా చేసానని చెప్పారు. కానీ అది కూడా అప్పుడు బెడిసి కొట్టింది.

కానీ ఫైనల్ గా మాత్రం మళ్ళీ తన హిట్ దర్శకుడు గోపీచంద్ మలినేనితో “క్రాక్” అనే పవర్ ఫుల్ మాస్ సబ్జెక్టు ను టేక్ చెయ్యగా ఇప్పుడు రిజల్ట్ 70 ఎం ఎం స్క్రీన్ మీద క్రిస్టల్ క్లియర్ గా కనిపిస్తుంది. దీనితో మాస్ మహారాజ్ కు ఫైనల్ గా మళ్ళీ తన మాస్ సినిమా ఆలోచనే మళ్ళీ నిలబెట్టేదిగా మారింది అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :