వరల్డ్ బిగ్గెస్ట్ హిట్ వెబ్ సిరీస్ షూట్ పూర్తి చేసుకుంది.!

Published on May 15, 2021 9:24 am IST

ప్రస్తుత రోజుల్లో డిజిటల్ వరల్డ్ ఎంతలా అభివృద్ధి చెందిందో చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా గత ఏడాది నుంచి అయితే మన దేశంలో కూడా ఓటిటికి విపరీతమైన పాపులారిటీ వచ్చింది. మరి ఇలా ఒక్క మన దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్త ఓటిటిలో అత్యధిక పాపులారిటీ తెచ్చుకున్న వెబ్ సిరీస్ ఏదన్నా ఉంది అంటే అది “మనీ హెయిస్ట్” సిరీస్ అనే చెప్పాలి.

ఇప్పటి వరకు నాలుగు సీజన్స్ కంప్లీట్ చేసుకున్న ఈ సిరీస్ ఇప్పుడు ఐదో సీజన్ తో ముందుకు రానుంది. స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉన్న ఈ స్పానిష్ సిరీస్ ప్రతీ భాషలోని ప్రతీ దేశంలోని హిట్టయ్యింది. మైండ్ బ్లోయింగ్ ట్విస్టులతో ఆద్యంతం రసవత్తరంగా ఎంటర్టైన్ చేసిన నాలుగు సీజన్ల తర్వాత అంతా సీజన్ 5 కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణంలో ఈ సీజన్ కంప్లీట్ షూట్ అయ్యిపోయినట్టుగా ఆ మేకర్స్ కన్ఫర్మ్ చేసారు.

ఇది వరకే ఒక్కక్కరిగా తమ షూట్స్ ను కంప్లీట్ చేసుకుంటూ వస్తున్న నటులు ఎట్టకేలకు మొత్తం అందరూ కంప్లీట్ చేసుకొని గ్యాంగ్ అంతా ఒక హ్యాపీ ఫోటోతో కనిపించి ఎండ్ కార్డు వేశారు. మరి ఈసారి ప్రొఫెసర్ ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ను ఇస్తాడో చూడాలి. అలాగే ప్రపంచం అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ వెబ్ సిరీస్ వచ్చే ఆగష్టు లో విడుదల కానుంది అని తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :