నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి వచ్చేసిన నాగార్జున ‘ది ఘోస్ట్’

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి వచ్చేసిన నాగార్జున ‘ది ఘోస్ట్’

Published on Nov 2, 2022 1:23 AM IST


కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా సోనాల్ చౌహన్ హీరోయిన్ గా తెరకెక్కిన లేటెస్ట్ థ్రిల్లింగ్ యక్షన్ మూవీ ది ఘోస్ట్. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీని ఏషియన్ సునీల్, శరత్ మరార్, రామ్మోహన్ రావు పుస్కూర్ ఎంతో భారీ వ్యయంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ మూవీలో నాగార్జున, విక్రమ్ అనే రా ఏజెంట్ గా పవర్ఫుల్ పాత్రలో కనిపించారు.

అయితే మొదటి నుండి ఆడియన్స్ లో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ ఇటీవల థియేటర్స్ లో రిలీజ్ అయి మంచి విజయాన్ని అందుకుంది. అయితే విషయం ఏమిటంటే, నవంబర్ 2 నుండి ప్రముఖ ఒటిటి మాధ్యమం నెట్ ఫ్లిక్స్ లో ఈ మూవీ బుల్లితెర ఆడియన్స్ ముందుకి రానున్నట్లు ఇప్పటికే అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది. కాగా కొద్దిసేపటి క్రితం నుండి ఈ మూవీ తెలుగు, తమిళ భాషల్లో నెట్ ఫ్లిక్స్ ఆడియన్స్ ముందుకి రావడం జరిగింది. మరి ఈ మూవీ ఎంతమేర ఓటిటి ఆడియన్స్ ని ఆకట్టుకుని ఏ స్థాయి వ్యూస్ ని అందుకుంటుందో చూడాలని అంటున్నారు విశ్లేషకులు.

ది ఘోస్ట్ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు