రీఎంట్రీ పై నోరువిప్పిన పవన్, కారణం అదే..!

Published on Jan 31, 2020 7:00 am IST

పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఆయన ఇప్పటికే రెండు చిత్రాల షూటింగ్ షురూ చేశారు. అందులో ఒకటి హిందీ హిట్ మూవీ పింక్ రీమేక్ కాగా, రెండవది క్రిష్ దర్శకత్వంలో ఓ పీరియాడిక్ మూవీ. ఈ రెండు చిత్రాలను ఏక కాలంలో పవన్ పూర్తి చేయనున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవన్ చేస్తున్న పింక్ రిమేక్ సమ్మర్ లో విడుదలయ్యే అవకాశం కలదు.

కాగా పవన్ తన రీ ఎంట్రీని ప్రకటించలేదు. ఆయన మళ్ళీ సినిమాలలో నటిస్తున్నాను అనే విషయాన్ని బహిర్గతం చేయడానికి ఇష్టపడలేదు. ఐతే జనసేన పార్టీలో మొదటినుండి క్రియాశీలక పాత్ర వహిస్తున్న జె డి లక్ష్మీ నారాయణ నిన్న పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ వీడడానికి కారణంగా ఆయన పవన్ మళ్ళీ సినిమా వైపు రావడమే అని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో పవన్ తన రీ ఎంట్రీపై మెదటిసారి స్పందించారు. నాకు పరిశ్రమలు లేవు…ఆస్తులు లేవు… పార్టీని, నమ్ముకున్న కొన్ని కుటుంబాలను నడపడానికి నాకు ఆదాయం కావాలి, అందుకే మళ్ళీ నటిస్తున్నాను అని పవన్, విమర్శలకు వివరణ ఇచ్చారు.

సంబంధిత సమాచారం :