ఇండియన్ రిలీజ్ కు రెడీ అవుతున్న మైండ్ బెండింగ్ సినిమా.!

Published on Nov 22, 2020 5:43 pm IST

ఇంటర్నేషనల్ సినిమాను ఫాలో అయ్యే ప్రతీ ఒక్కరికీ కూడా హాలీవుడ్ ఫిల్మ్ మేకర్ క్రిస్టోఫర్ నోలన్ కోసం కూడా ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. అలాగే తన సినిమాలకు కూడా సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. మరీ ముఖ్యంగా అయితే మన ఇండియన్ సినిమాలో కూడా నోలన్ సినిమాలు అంటే ఇష్టపడే వారు ఉన్నారు.

అయితే తన సినిమాలతో మైండ్ బెండింగ్ ఎక్స్ పీరియన్స్ ను అందించే క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన తాజా చిత్రం “టెనెట్”కు కాస్త చేదు అనుభవం మిగిలింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రానికి ఇలా జరగడం కూడా చాలా మందికి బాధగా అనిపించిన అంశం.

ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కు ప్లాన్ చేసిన ఈ చిత్రంకు కరోనా వల్ల అనుకున్న స్థాయి విడుదలకు నోచుకోక సెలెక్టెడ్ గా విడుదలయ్యి కాస్త నష్టాలనే చూడాల్సి వచ్చింది. టైం లో సరికొత్త ఎక్స్ పీరియన్స్ ను అందించేలా చాలా వరకు నిజమైన విజువల్స్ తెరకెక్కించిన ఈ చిత్రం ఇండియన్ రిలీజ్ కోసం చాలా మంది ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు.

కానీ ఫైనల్ గా చిత్ర నిర్మాణ సంస్థ వారు వార్నర్ బ్రదర్స్ అనౌన్స్ చేసారు. వచ్చే డిసెంబర్ 4న ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ్ మరియు ఇతర భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరి ఎన్ని థియేటర్స్ లో ఈ చిత్రం ఎలా విడుదల కానుందో చూడాలి.

సంబంధిత సమాచారం :

More