చరణ్, శంకర్ ల ప్రాజెక్ట్ పై ఈ పెద్ద రూమర్ కి చెక్ పడ్డట్టేగా.!

Published on Apr 30, 2021 10:00 am IST

ప్రస్తుతం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శక ధీరుడు రాజమౌళితో ఓ భారీ పీరియాడిక్ మల్టీ స్టారర్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. మరి దీని తర్వాత ఊహించని విధంగా మరో ఇండియన్ టాప్ దర్శకుడు శంకర్ ను కూడా చరణ్ లైనప్ లో పెట్టుకోడంతో దానిపై కూడా ఎనలేని అంచనాలు సెట్ చేసుకోగలిగాడు. అయితే ఈ సినిమా అనౌన్సమెంట్ తోనే దిమ్మతిరిగే గాసిప్స్ వచ్చేసాయి మరి వాటిలో ఓ ఊహించని అంశం ఇప్పుడు క్లారిటీకి వచేసినట్టే అని చెప్పాలి.

అదే..ఈ సినిమా పాన్ ఇండియన్ లెవెల్లో కాదు పాన్ ఆసియన్ లెవెల్లో ఉంటుంది అని. అందులో భాగంగానే ప్రముఖ కొరియన్ నటి బే సుజీని చరణ్ కి సరేనా ఫిక్స్ చేసారని వచ్చిన టాక్ ఇంటర్నేషనల్ వైడ్ కూడా ఓ రేంజ్ లో వైరల్ అయ్యింది. కానీ ఫైనల్ గా ఇప్పుడు ఈ చిత్రంలో చరణ్ సరసన కియారానే హీరోయిన్ గా కనిపించడం ఫిక్స్ అయ్యిందని తెలియడంతో ఆ మహా రూమర్ కి చెక్ పడ్డట్టే అయ్యిందని చెప్పాలి. మరి ఈ సినిమాకు సంబంధించి మరింత సమాచారం రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :