సెన్సేషనల్ ‘వార్ 2’ టీజర్ రిలీజ్ టైం ఫిక్స్!?

సెన్సేషనల్ ‘వార్ 2’ టీజర్ రిలీజ్ టైం ఫిక్స్!?

Published on May 19, 2025 6:00 PM IST

మ్యాన్ ఆఫ్ మాస్ ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా రానున్న బ్లాస్టింగ్ ట్రీట్ లలో వార్ 2 టీజర్ కూడా ఒకటి. దీనిపై ఉన్న హైప్ అయితే అంతా ఇంతా కాదు ఎన్టీఆర్ నుంచి బాలీవుడ్ లో మొదటి సినిమా కావడం అది కూడా తన ఎంట్రీ సెన్సేషనల్ ఫ్రాంచైజ్ తో ఉండడంతో తారక్ పై హైప్ వేరే లెవెల్లో ఉంది. ఇక మేకర్స్ కూడ టీజర్ ని మే 20న రిలీజ్ కి ఫిక్స్ కూడా చేసేసారు.

అయితే అసలు టీజర్ ఎప్పుడు వస్తుంది అనేది సమయం ఇంకా సస్పెన్స్ గానే ఉంది. కానీ ప్రస్తుతం ఫైనల్ గా ఇందుకు సమయం లాక్ అయినట్టుగా తెలుస్తుంది. వార్ 2 టీజర్ రేపు మే 20 ఉదయం 11 గంటలకి అన్ని భాషల్లో విడుదల కానుందట. మొత్తానికి మాత్రం పాన్ ఇండియా మార్కెట్ ని షేక్ చేసే టీజర్ ఇపుడు రాబోతుంది అని చెప్పొచ్చు. జస్ట్ దీనిపై అధికారిక క్లారిటీ ఒక్కటి బాకీ ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు