భారీ బడ్జెట్ సినిమాకు సైన్ చేసిన త్రిష

Published on Dec 5, 2019 10:24 am IST

’96’ సినిమాతో బౌన్స్ బ్యాక్ అయిన స్టార్ నటి త్రిష అదే జోరు కొనసాగిస్తోంది. ఈ సినిమా విజయంతో మరోసారి ఆమెకు పెద్ద సినిమా ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఆ సినిమాల్లో మణిరత్నం డైరెక్ట్ చేస్తున్న ‘పొన్నియన్ సెల్వన్’ కూడా ఒకటి. ఈ సినిమా అవకాశం చాలా రోజుల క్రితమే త్రిష వద్దకు వెళ్ళగా ఇన్నిరోజులు ఆలోచించిన ఆమె ఎట్టకేలకు సినిమాకు సైన్ చేసింది.

దర్శకుడు మణిరత్నం సినిమాలోని పాత్రకు కేవలం త్రిషను మాత్రమే తీసుకోవాలని బలంగా నిర్ణయించుకుని ఆమెకు అవకాశం ఇవ్వడం విశేషం.
ఈ చిత్రంలో జయం రవి, విక్రమ్, ఐశ్వర్యరాయ్, అనుష్క, కీర్తి సురేష్, విజయ్ సేతుపతి, అమలాపాల్, కార్తి, ఐశ్వర్య లక్ష్మి, మోహన్ బాబు లాంటి స్టార్లు నటించనున్నారు. ఇకపోతే త్రిష మలయాళంలో జీతు జోసెఫ్ డైరెక్షన్లో మొహాన్ లాల్ హీరోగా రూపొందినున్న సినిమాలో కథానాయకిగా నటించనుంది. అలాగే ఇంకొన్ని భారీ చిత్రాలు ఆఫర్లు కూడా ఆమె చేతిలో ఉన్నట్టు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :

More