తమిళనాడు సీఎం అలాగే దళపతి విజయ్ హీరోగా నటించిన ఆఖరి సినిమానే జన నాయగన్. తెలుగులో జన నాయకుడు పేరిట ప్లాన్ చేసిన ఈ సినిమాని దర్శకుడు హెచ్ వినోద్ దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది పెద్ద ప్రశ్నగా మారగా అభిమానులు విజయ్ సీఎం అయ్యాక త్వరగానే విడుదల ఉంటుంది అని భావించారు. కానీ తను సీఎం అయ్యిన తర్వాత కూడా సస్పెన్స్ తప్పలేదు.
దీనికి ప్రధాన కారణం సినిమా సెన్సార్ కాకపోవడం. కానీ ఇప్పుడు ఎట్టకేలకు సెన్సార్ ని సినిమా పూర్తి చేసుకున్నట్టు తెలుస్తోంది. మేకర్స్ ముందు నుంచీ కోరుకున్న ఏ సర్టిఫికెట్ నే జన నాయగన్ పొందినట్టు తమిళ సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇక విడుదల విషయానికి వస్తే దాదాపు ఈ జులై లోనే ఉంటుందట. లేదా ఆగస్ట్ కి షిఫ్ట్ అవుతుంది అని తెలుస్తోంది. సో దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు అలాగే కే వి ఎన్ సంస్థ నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.


