“వకీల్ సాబ్” దర్శకుని పేరిట ట్రెండ్ చేస్తున్నారుగా.!

Published on May 4, 2021 8:01 am IST

మాములుగా మన స్టార్ హీరోలు అలాగే టైర్ 2 హీరోలకు బర్త్ డే ట్రెండ్స్ చేసింది చూసి ఉంటాం అలాగే స్టార్ హీరోయిన్స్ కు కూడా బర్త్ డే ట్రెండ్స్ జరిగిన దాఖలాలు ఉన్నాయి. కానీ మొదటి సారో ఏమో ఒక దర్శకునికి బర్త్ డే ట్రెండ్ లక్ష ట్వీట్ల మేర ఇపుడు జరుగుతుంది. అదే వకీల్ సాబ్ దర్శకుడు వేణు శ్రీరామ్ పేరుపై ట్రెండ్ జరుగుతుంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఈ దర్శకుడు తీసిన లేటెస్ట్ చిత్రం “వకీల్ సాబ్” పవన్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ పెట్టింది. అసలు పింక్ లాంటి సబ్జెక్ట్ ని పవన్ ఇమేజ్ కి తగ్గట్టుగా మార్చేసి ఎక్కడా కూడా ఒరిజినల్ ఫ్లేవర్ పోకుండా తీసిన విధానంకు వారు వేణు శ్రీరామ్ కు ఫిదా అయ్యిపోయారు.

అందుకే వేణు శ్రీరామ్ పేరిట కృతజ్ఞతగా “హ్యాపీ బర్త్ డే మాస్ గాడ్ వేణు శ్రీరామ్” అనే హ్యాష్ ట్యాగ్ తో ఏ దర్శకునికి ఇవ్వని ట్రీట్ ను ఇండియన్ ట్రెండ్స్ లో పెట్టి ఇచ్చారు. అలా ఇప్పటికీ కూడా 90 వేలకు పైగా ట్వీట్స్ తో ట్రెండ్ నడుస్తుంది. మొత్తానికి మాత్రం పవన్ అభిమానులు వేణు శ్రీరామ్ కి మంచి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు.

సంబంధిత సమాచారం :