‘శ్రీవల్లి’ మొదటి 5 నిముషాలు అస్సలు మిస్ కాకూడదట !


ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ మరోసారి మెగా ఫోన్ పట్టుకుని చేసిన సినిమా ‘శ్రీవల్లి’. సైన్టిఫిక్ థ్రిల్లర్ గా ఉండనున్న ఈ సినిమాను ఈ శుక్రవారం ప్రేక్షకుల్ ముందుకు తీసుకొస్తున్నారు. మనిషి మనసులోని ఆలోచనా తరంగాలను స్టడీ చేయడం, తద్వారా ఆ వ్యక్తి గత జన్మ తాలూకు జ్ఞాపకాల్లోకి వెళ్లి, మనసులోని చెడును దూరం చేయడం అనే ఆసక్తికరమైన అంశాలతో ఈ చిత్రం రూపొందింది.

టీజర్, ట్రైలర్లతో ఆసక్తిని రేకెత్తించిన ఈ చిత్రంలో మరొక ఆసక్తికరమైన సమ కూడా ఉంది . అదే ఈ చిత్రంలో రాజమౌళి కాంట్రిబ్యూషన్. కాంట్రిబ్యూషన్ అంటే కథలో, దర్శకత్వంలో కాదు వాయిస్ ఓవర్ ఇవ్వడంలో. సినిమా మొదటి 5 నిముషాల్లో చిత్ర ఉద్దేశ్యాన్ని రాజమౌళి తన మాటల ద్వారా వివరిస్తారట. ఈ 5 నిముషాలు చాలా కీలకమని, అస్సలు మిస్ కాకూడదని చిత్ర నిర్మాత సునీత తెలిపారు. ఇకపోతే ఈ చిత్రంలో రజత్, నేహా హింగే హీరో హీరోయిన్లుగా నటించగా ఎమ్.ఎమ్ శ్రీలేఖ సంగీతాన్ని అందించారు.