మాస్ మహారాజా ఫ్యాన్స్ కి చవితి స్పెషల్ గిఫ్ట్.

Published on Aug 28, 2019 10:08 am IST

మాస్ మహరాజా రవి తేజా కొత్త చిత్రం డిస్కో రాజా. దర్శకుడు వి ఆనంద్ ఓ నూతన కథాంశంతో విభిన్నంగా తెరకెక్కిస్తున్నారని సమాచారం. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రంలోని రవితేజ ఫస్ట్ లుక్ విడుదలకు ముహూర్తం ఖరారు చేశారు. వచ్చే నెల 2న వినాయక చవితి కానుకగా డిస్కో రాజా ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నారు. ఈ మేరకు చిత్ర యూనిట్ ప్రకటిచడం జరిగింది.

రవితేజ సరసన పాయల్ రాజ్ పుత్, తాన్యా నటిస్తుండగా ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం సమకూరుస్తుండగా ఈ ఏడాది చివర్లో విడుదలయ్యే అవకాశం కలదు. స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ ఈ చిత్రంలో కూడా నవ్వులు పూయించనున్నారని సమాచారం.

సంబంధిత సమాచారం :