ఈ రోజు విడుదలవుతున్న దేవదాస్ సాంగ్ !

Published on Aug 30, 2018 11:23 am IST

కింగ్ నాగార్జున, నానిల మల్టీ స్టారర్ ‘దేవదాస్’ చిత్రంలోని మొదటి సాంగ్ ‘వారు వీరు’ నిన్న నాగ్ బర్త్ డే సంధర్బంగా విడుదలవాల్సి ఉండగా హరికృష్ణ మృతితో ఈ కార్యక్రమాన్ని రద్దు చేశారు. ఇక ఇప్పుడు ఈ రోజు 6గంటలకు ఈ సాంగ్ విడుదల కానుంది. శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కిస్తున్నఈచిత్రంలో రష్మిక, ఆకాంక్ష సింగ్ లు కథానాయికలుగా నటిస్తున్నారు.

ప్రస్తుతం ఈచిత్రం చివరి షెడ్యూల్ షూటింగ్ ను జరుపుకుంటుంది. మరో 4రోజుల్లోఈ షెడ్యూల్ కంప్లీట్ కానుంది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ నిర్మిస్తుంది. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్నఈచిత్రం సెప్టెంబర్ 27న విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :

X
More