పాటతో ఉపేస్తానంటున్న ‘డిస్కో రాజ’

Published on Oct 8, 2019 9:05 am IST

మాస్ మహారాజ రవితేజ తన నెక్స్ట్ సినిమాను విఐ ఆనంద్ డైరెక్షన్లో చేస్తున్న సంగతి తెల్సిందే. ఈ చిత్రానికి ‘డిస్కో రాజా’ అనేది టైటిల్. ఇదొక సైన్స్ ఫిక్షన్ సినిమా. ఇప్పటికే షూటింగ్ చివరి దశలో ఉండటంతో ప్రచార కార్యక్రమాల్ని షురూ చేసింది టీమ్. అందులో భాగంగానే మొదటి పాటను సిద్దం చేసింది టీమ్.

ఈ పాటను అక్టోబర్ 19న విడుదల చేయనున్నారు. నాభ నటేష్, పాయల్ రాజ్ పుత్, తాన్య హోప్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. సైంటిఫిక్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై రామ్‌ తాళ్లూరి నిర్మిస్తున్నారు. ఇందులో రవితేజ డ్యూయల్ రోల్‌లో నటిస్తున్నారు. ఇకపోతే ఈ చిత్రాన్ని డిసెంబర్ 20న ప్రేక్షకులకు అందివ్వనున్నారు.

సంబంధిత సమాచారం :

X
More