జాను నుండి ఫస్ట్ సింగిల్ ప్రాణం..!

Published on Jan 20, 2020 9:00 pm IST

సమంత, శర్వానంద్ ల ఫీల్ గుడ్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ జాను చిత్రం నుండి రేపు ఫస్ట్ సింగిల్ విడుదల చేస్తున్నారు. ప్రాణం…అనే ఈ ఫస్ట్ సింగిల్ మెలోడియస్ గా మనసుకు హత్తుకునేలా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతుంది. జాను తమిళ చిత్రం 96కి తెలుగు రీమేక్. తమిళంలో త్రిషా, విజయ్ సేతుపతి చేసిన పాత్రలను ఇక్కడ సమంత, శర్వానంద్ చేస్తున్నారు. జాను టీజర్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్స్ కి మంచి స్పందన వచ్చింది.

కాగా ఒరిజినల్ చిత్రానికి దర్శకత్వం వహించిన సి ప్రేమ్ కుమార్ తెలుగు వర్షన్ జాను ని కూడా తెరకెక్కిస్తున్నారు. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాతగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. 96 సినిమాకు స్వరాలు అందించిన గోవింద్ వసంత్ జాను కి మ్యూజిక్ అందించారు. జాను చిత్రం ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 14న విడుదలయ్యే అవకాశం కలదు.

సంబంధిత సమాచారం :

X
More