‘జెర్సీ’.. ‘అదేంటో గాని ఉన్నపాటుగా’ !

‘జెర్సీ’.. ‘అదేంటో గాని ఉన్నపాటుగా’ !

Published on Feb 11, 2019 5:42 PM IST


నాని హీరోగా ‘మళ్ళీ రావా’ ఫేమ్ గౌతం తిన్ననూరి దర్శకత్వంలో రాబోతున్న చిత్రం ‘జెర్సీ’. కాగా వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ నెల 14వ తేదీన ఈ చిత్రం నుండి ‘అదేంటోగాని ఉన్నపాటుగా’ అనే సాంగ్ ని రిలీజ్ చేయనున్నారు. ఇక ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై ఈ చిత్రం రూపొందుతుంది. కాగా, ఈ సినిమాలో నాని సరసన శ్రద్ధా శ్రీనాథ్‌ హీరోయిన్ గా నటిస్తోంది.

జెర్సీ చిత్రం ప్రధానంగా క్రికెట్ నేపథ్యంలో.. ఓ పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కబోతుంది. షూటింగ్ కూడా చాలా వేగంగా జరుగుతుందని.. సీన్స్ అనుకున్నదాని కంటే బాగా వస్తున్నాయని తెలుస్తోంది. ఈ చిత్రానికి తమిళ యువ సంగీత దర్శకుడు అనిరుధ్ సంగీతం అందిస్తుండగా నిర్మాత సూర్య దేవర నాగ వంశి నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు