మాస్టర్ మూవీ నుండి ఫస్ట్ సింగిల్ వచ్చేస్తుంది

Published on Feb 11, 2020 5:36 pm IST


గత ఏడాది బిగిల్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు హీరో విజయ్. తెలుగు తమిళ భాషలలో విడుదలైన ఈ మూవీ రెండు చోట్ల హిట్ గా నిలిచింది. బిగిల్ మూవీతో విజయ్ డొమెస్టిక్ గా 200కోట్ల వసూళ్లు రాబట్టిన హీరోగా ఆ క్లబ్ లో చేరాడు. ఇక ఆయన తన తదుపరి చిత్రం టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనక రాజ్ దర్శకత్వంలో చేస్తున్నారు. ఈ చిత్రానికి మాస్టర్ అనే టైటిల్ నిర్ణయించారు.

నేడు ఈమూవీపై ఓ అప్డేట్ ఇచ్చారు. ఈనెల 14న వాలెంటైన్స్ డే కానుకగా ఈ చిత్రం నుండి ఫస్ట్ సింగిల్ విడుదల కానుంది. ఓరు కుట్టి కథై..అనే ఫస్ట్ సింగిల్ ఆరోజు సాయంత్రం 5గంటలకు విడుదల చేస్తున్నారు. ఇక ఈ చిత్రానికి సంగీతం అనిరుధ్ అందిస్తున్నారు.గ్జివిఆర్ బ్రిట్టో ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా విజయ్ సేతుపతి విలన్ రోల్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :