సార్: ఆకట్టుకుంటున్న మెలోడియస్ “మాస్టారు మాస్టారు” సాంగ్!

సార్: ఆకట్టుకుంటున్న మెలోడియస్ “మాస్టారు మాస్టారు” సాంగ్!

Published on Nov 10, 2022 6:55 PM IST

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా, సంయుక్త మీనన్ హీరోయిన్ గా వెంకీ అట్లూరి దర్శకత్వం లో తెరకెక్కుతున్న చిత్రం సార్. తమిళం లో వాతి పేరిట తెరకెక్కుతోంది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థ తో కలసి నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ చిత్ర నిర్మాణ సంస్థ సార్ కు సమర్పకునిగా వ్యవహరిస్తోంది. తెలుగు, తమిళంలో నిర్మిస్తున్న ఈ ద్విభాషా చిత్రం నిర్మాణ కార్యక్రమాలు ముగింపు దశలో ఉండగా, మరోవైపు సినిమాకి ప్రమోషన్స్ ను షురూ చేయడం జరిగింది. ఇందులో భాగంగానే చిత్రానికి సంబంధించిన ఫస్ట్ సింగిల్ ను ఈరోజు విడుదల చేయడం జరిగింది.

మాస్టారు మాస్టారు, నా మనసును గెలిచారు అంటూ సాగే ఈ గీతానికి తమిళంలో ధనుష్, తెలుగు లో రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. పాట చిత్రీకరణ బాగుంది. నాయిక, నాయికల భావోద్వేగాలు, కనిపించే దృశ్యాలు, వారి అభినయం వీక్షకుల మనసును హత్తుకుంటాయి. కళాశాల నేపధ్యంలో శేఖర్ మాస్టర్ నేతృత్వంలో చిత్రీకరించుకున్న ఈ గీతం చిత్ర కథానుసారం కథానాయకుడు ధనుష్ ప్రవర్తన, అతని మంచి మనస్తత్వం, గొప్పతనం గుర్తెరిగిన నాయిక సంయుక్త మీనన్ మనసు ప్రేమైక భావన కు గురైన సందర్భం. ఆ ఊహల్లో, అలాంటి నేపధ్యంలో వచ్చే గీతం ఇది. పాటానుసారం ధనుష్, సంయుక్త మీనన్, విద్యార్థులు కనిపిస్తారు.

సంగీత దర్శకుడు జి వి ప్రకాష్ కుమార్ స్వర పరిచిన బాణీలు సంగీత ప్రియుల్ని మధురమైన భావనకు గురిచేస్తాయి అంటున్నారు ఈ పాట రచయిత సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి. ఆయన మాటల్లోనే ఇంకా చెప్పాలంటే, ఇది అచ్ఛ తెలుగు పాట, ఓ అందమైన పాట, మంచి పాట, ప్రయోజనం ఉన్న పాట, ఉపయోగం ఉన్న పాట, సున్నితమైన భావోద్వేగాలు కలిగిన పాట ఇది. పాట రాయటానికి కొంత కష్ట పడినప్పటికీ, దర్శకుడు వెంకీ గారు చెప్పిన పాట సందర్భం, ఆయన ఆలోచనలు అన్నీ చక్కని సాహిత్యం సమకూర్చటానికి నన్ను ముందుకు నడిపాయి. ఈ పాట కు ఇటు నేను, అటు తమిళంలో ధనుష్ సాహిత్యం అందించటం కొత్త అనుభూతి. భావం ఒక్కటే అయినా శైలి భిన్నంగా ఉంటుంది. జి వి ప్రకాష్ బాణీ ల్లో మరింతగా ఒదిగిన సాహిత్యం ఉన్న పాట ఇది. గాయని శ్వేతా మోహన్ గాత్రం పాటను మళ్లీ మళ్లీ వినాలనిపించేలా చేస్తుంది.
చాట్ బస్టర్స్ లో నిలిచే పాట ఇది. అవకాశం ఇచ్చిన దర్శకుడు వెంకీ అట్లూరి, నిర్మాతలు నాగ వంశీ, సాయి సౌజన్య గార్లకు కృతజ్ఞతలు అంటూ తన సంతోషాన్ని వ్యక్తం పరిచారు గీత రచయిత రామజోగయ్య శాస్త్రి.

ఇటీవల చిత్రం నుంచి విడుదల అయిన ప్రచార చిత్రాలు సార్ పై అమితాసక్తి కలిగించాయి. విద్యావ్యవస్థ తీరు తెన్నుల మీదుగా కథానాయకుడు సాగించే ప్రయాణం అందులోని సమస్యలు, సంఘటనలు సార్ జీవితాన్ని ఏ తీరానికి చేర్చాయన్నది అటు ఆసక్తి ని, ఇటు ఉద్విగ్నత కు గురి చేస్తుందని చిత్ర నిర్మాతలు తెలిపారు.

ధ‌నుష్‌, సంయుక్తా మీన‌న్‌, సాయికుమార్, తనికెళ్ల భ‌ర‌ణి, సముద్ర ఖని, తోటపల్లి మధు, నర్రా శ్రీను, పమ్మి సాయి, హైపర్ ఆది, సార, ఆడుకాలం నరేన్, ఇలవరసు, మొట్టా రాజేంద్రన్, హరీష్ పేరడి, ప్రవీణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ అవినాష్ కొల్లా, ఎడిట‌ర్ న‌వీన్ నూలి, సినిమాటోగ్రాఫ‌ర్ జె.యువరాజ్, మ్యూజిక్ జి.వి. ప్ర‌కాష్‌కుమార్‌, యాక్షన్ కొరియోగ్రాఫర్ వెంకట్, స‌మ‌ర్ప‌ణ శ్రీకర స్టూడియోస్, నిర్మాత‌లు నాగ‌వంశీ ఎస్‌., సాయి సౌజ‌న్య‌, రచన, దర్శకత్వం వెంకీ అట్లూరి, పి ఆర్ ఓ లక్ష్మీవేణుగోపాల్ లుగా వ్యవహరిస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు