ఉస్తాద్ వచ్చేస్తున్నాడు.. ఇక పవన్ మేనియాలో ఊగిపోవాల్సిందే..!

ఉస్తాద్ వచ్చేస్తున్నాడు.. ఇక పవన్ మేనియాలో ఊగిపోవాల్సిందే..!

Published on Dec 1, 2025 8:00 PM IST

Ustad-bhagath-singh

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసింది. దర్శకుడు హరీష్ శంకర్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండటంతో ఈ మూవీ ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. కాగా ఈ సినిమా నుండి మేకర్స్ తాజాగా ఓ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.

‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీలోని ఫస్ట్ సింగిల్ సాంగ్ త్వరలోనే రానుందని ప్రకటించారు. దీనికి సంబంధించి ఓ వీడియోను కూడా రిలీజ్ చేశారు. ఇందులో వింటేజ్ లుక్స్‌తో పవన్ సూట్‌లో కనిపించి అభిమానులను థ్రిల్ చేశాడు. ఇక దేవిశ్రీ ప్రసాద్ మరోసారి తన ట్యూన్స్‌తో ఓ చార్ట్‌బస్టర్ సాంగ్‌ను రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది.

‘డిసెంబర్ నెలను సెలబ్రేట్ చేసుకుందాం..’ అంటూ మేకర్స్ వెల్లడించారు. ఇక ఈ సినిమాలో శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు