‘విష్ణు విన్యాసం’ ఫస్ట్ సింగిల్ లాంచ్.. ‘దేఖో విష్ణు విన్యాసం’తో ఫుల్ ఫన్!

‘విష్ణు విన్యాసం’ ఫస్ట్ సింగిల్ లాంచ్.. ‘దేఖో విష్ణు విన్యాసం’తో ఫుల్ ఫన్!

Published on Jan 8, 2026 8:33 PM IST

Dekho Vishnu Vinyasam

కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ శ్రీ విష్ణు ప్రస్తుతం ‘విష్ణు విన్యాసం’ అనే ఫన్-ఎంటర్టైనర్‌లో నటిస్తున్నాడు. ఈ సినిమాను దర్శకుడు మారుతి రావు తెరకెక్కిస్తుండగా ఇప్పటికే ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ అవగా దానికి ప్రేక్షకుల నుంచి సాలిడ్ రెస్పాన్స్ దక్కింది. ఇక ఇప్పుడు ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.

‘దేఖో విష్ణు విన్యాసం’ అంటూ సాగే ఈ ఫస్ట్ సింగిల్ సాంగ్‌లో శ్రీ విష్ణు పాత్ర ఎలా ఉండబోతుందా వివరించారు. న్యూమరాలజీ, జ్యోతిష్యాన్ని బలంగా నమ్మే వ్యక్తిగా శ్రీ విష్ణు కనిపించబోతున్నాడు. ఇక ఈ పాటను హైదరాబాద్‌లోని మల్లా రెడ్డి కాలేజీలో విడుదల చేశారు. రాధన్ మంచి పెప్పీ ట్యూన్ కంపోజ్ చేయగా రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు.

ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా నయన్ సారిక నటిస్తోంది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమా బ్యానర్‌ పై సుమంత్ నాయుడు.జి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఫిబ్రవరి 2026లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు