‘రొమాంటిక్’ పాటను సిద్దం చేసిన పూరి అండ్ టీమ్

‘రొమాంటిక్’ పాటను సిద్దం చేసిన పూరి అండ్ టీమ్

Published on Dec 20, 2019 12:00 PM IST

romantic

దర్శకుడు పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి హీరోగా రూపొందుతున్న చిత్రం ‘రొమాంటిక్’. అనిల్ పాడూరి డైరెక్షన్లో ఈ చిత్రం రూపొందుతోంది. చిత్రీకరణ ఒక కొలిక్కి రావడంతో టీమ్ మిగతా పనుల్ని మొదలుపెట్టారు. ప్రచార కార్యక్రమాల్లో భాగంగా మొదటి పాట ‘నువ్వు నేను ఈ క్షణం’ అనే పాటను విడుదలకు సిద్దం చేశారు.

ఈ రొమాంటిక్ వీడియో సాంగ్ రేపు సాయంత్రం 5 గంటలకు విడుదలకానుంది. సునీల్ కశ్యప్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. పూరి జగన్నాథ్, ఛార్మీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే యేడాది వేసవికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో ఆకాష పూరికి జోడీగా కేతిక శర్మ నటిస్తోంది. గత చిత్రం ‘మెహబూబా’ సరైన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ఈ చిత్రంపైనే ఆశలు పెట్టుకున్నాడు ఆకాష పూరి.

తాజా వార్తలు