5 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకున్న “సార్పట్ట పరంబరై” ట్రైలర్!

Published on Jul 16, 2021 10:47 am IST

తమిళ నాట స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కుతున్న తాజా చిత్రం సార్పట్ట పరంబరై. ఈ చిత్రం బాక్సింగ్ నేపథ్యం లో కొనసాగనుంది. అయితే ఈ చిత్రం ను తమిళ సెన్సేషన్ డైరెక్టర్ పా. రంజిత్ దర్శకత్వం వహించగా ఆర్య హీరోగా నటించారు. ఈ చట్టం విడుదల కి సిద్దం అవుతుండటం తో తాజాగా ట్రైలర్ విడుదల చేయడం జరిగింది. అయితే ఈ చిత్ర ట్రైలర్ ఇప్పటి వరకూ 5 మిలియన్స్ కి పైగా వ్యూస్ సాధించడం జరిగింది, రెండు లక్షలకు చేరువ లో లైక్స్ సాధించడం విశేషం.

అయితే ఈ చిత్రం డైరక్ట్ ఓటిటి గా విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం జూలై 22 వ తేదీన అమెజాన్ ప్రైమ్ విడియో ద్వారా విడుదల కానుంది. 22 వ తేదీ కోసం ఆర్య అభిమానులు, ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం కి సంగీతం సంతోష్ నారాయణన్ అందించారు. తెలుగు లో సైతం ఈ చిత్రం స్ట్రీమ్ కానుంది.

ట్రైలర్ చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :