స్వీట్ అండ్ క్యూట్ పార్టీలో టాలీవుడ్ కమెడియన్స్ !

స్వీట్ అండ్ క్యూట్ పార్టీలో టాలీవుడ్ కమెడియన్స్ !

Published on Nov 15, 2021 11:00 AM IST

టాలీవుడ్ లో కమెడియన్స్ అందరూ ఫ్లయింగ్ కలర్స్ అని ఓ గ్రూప్ ను ఫామ్ చేసుకుని ప్రతి నెల కలుస్తూ సరదాగా గడుపుతుంటారు. ఈ గ్రూప్ లో వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, నందు, సప్తగిరి, తాగుబోతు రమేష్, ధనరాజ్, వేణు, సత్య, రఘు, చిత్రం శ్రీను, సత్యం రాజేష్, ఇంకా మరొకొందరు సభ్యులుగా ఉన్నారు. వీరందరూ ఒకరికి ఒక్కరూ పార్టీలు ఇచ్చుకుంటూ ఐకమత్యంగా ఉంటున్నారు.

తాజాగా ఈ గ్రూప్ మెంబర్స్ మళ్ళీ కలుసుకుని ఒక పార్టీ చేసుకున్నారు. ఈ పార్టీ గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. ‘స్వీట్ అండ్ క్యూట్ పార్టీ. హోస్టింగ్ చేసింది వెన్నెల కిషోర్, కమెడియన్ సత్య. లవ్ యూ’ అంటూ యాక్టర్ ధనరాజ్ ఫోటోతో పాటు ఒక మెసేజ్ కూడా పోస్ట్ చేశాడు. మొత్తానికి కమెడియన్స్ అందరూ కలిసి సీరియస్ గానే ఫ్రెండ్షిప్ చేస్తున్నారు. వీళ్ళ ఫ్రెండ్షిప్ ఇలాగే కొనసాగాలని కోరుకుందాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు