
శంకర్, రజనీకాంత్‌ల క్రేజీ కాంబినేషన్లో రూపొంది సౌత్ ఇండియన్ సినిమాల్లో ఓ ట్రెండ్ సెట్ చేసిన సినిమా ‘రోబో’. 2010లో విడుదలైన ఈ గ్రాఫికల్ వండర్‌కు ప్రస్తుతం సీక్వెల్ రూపొందించే విషయమై దర్శకుడు శంకర్ కసరత్తులు చేస్తోన్న విషయం తెలిసిందే. ఇండియన్ సినిమాల్లో ఓ అద్భుతంగా ‘రోబో 2’ ఉండేలా శంకర్ సన్నాహాలు చేస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే అత్యంత భారీ బడ్జెట్‌తో విజువల్ వండర్‌గా ఈ సినిమాను రూపొందించేలా టీమ్ ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టింది.
ఇక తాజా సమాచారం మేరకు ఈ సినిమాను నిర్మించేందుకు లండన్‌కు చెందిన ఓ ప్రముఖ నిర్మాత ముందుకొచ్చారని తెలుస్తోంది. సుమారు 240 కోట్ల బడ్జెట్ అంచనాతో తెరకెక్కనున్న ఈ సినిమాకు ఫండింగ్ ఇచ్చేందుకు ఇప్పటికే పలు పెద్ద నిర్మాణ సంస్థలు సైతం ముందుకు వచ్చాయి. ఇక ఇప్పుడు ఏకంగా ఫారిన్ ప్రొడ్యూసర్స్ కూడా రావడం ఆసక్తికరంగా కనిపిస్తోంది. 3డీలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందనున్న ఈ సినిమాకు ఇంటర్నేషనల్ ఫీల్ తెచ్చేందుకు దర్శకుడు శంకర్, ఈ సినిమాలో విలన్‌గా నటించేందుకు హాలీవుడ్ నటుడిని ఒప్పించనున్నట్లు సమాచారం. డిసెంబర్‌లో ఈ సినిమా ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది.

