సినిమా హాళ్లు తెరుచుకోవడానికి సమయం ఆసన్నమైంది

Published on Jun 7, 2021 7:20 pm IST

గత లాక్ డౌన్ సమయంలో ప్రభుత్వం సినిమా థియేటర్లను మూసివేయించింది. కానీ సెకండ్ వేవ్ సమయంలో మాత్రం థియేటర్ యాజమాన్యాలే స్వచ్ఛందంగా సినిమా హాళ్లను మూసివేశారు. ఇప్పటికే సినిమా హాళ్లు మూతబడి రెండు నెలలకు పైనే అవుతోంది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న తరుణంలో సినిమా హాళ్లు తెరవడంపై చర్చ మొదలైంది. ఇప్పటికే పూర్తైన అనేక సినిమాలు విడుదలకు రెడీగా ఉన్నాయి. నిర్మాతలు, హీరోలు గత సంవత్సరంలా కాకుండా ఈసారి త్వరగా సినిమా హాళ్లు తెరుచుకుంటాయనే నమ్మకంతో ఉన్నారు. వారి నమ్మకమే నిజమయ్యేలా ఉంది.

జూలై మొదటి వారం నుండి సినిమా థియేటర్లు తెరుచుకునే వాతావరణం కనిపిస్తోంది. తెలంగాణలో అయితే వంద శాతం ఆక్యుపెన్సీకి అనుమతులు దొరికడానికి ఎక్కువ అవకాశాలున్నాయి. ఎందుకంటే ఈ నెలాఖరులోగా తెలంగాణలో లాక్ డౌన్ పూర్తిగా ఎత్తివేసే సూచనలున్నాయి. ఇక ఆంధ్రాలో అయితే 50 శాతం ఆక్యుపెన్సీకి అనుమతులు లభించే వీలుంది. మొత్తంగా జూలై నెల నుండి ఏపీ, తెలంగాణల్లో సినిమాల సందడి మొదలవుతుందన్నమాట.

సంబంధిత సమాచారం :