షాకింగ్ లుక్ లో మాజీ హీరోయిన్ !

Published on Jun 20, 2021 8:46 pm IST

మాజీ హీరోయిన్‌ రక్షిత ఒకప్పుడు ఎంతో అందంగా స్లిమ్ గా ఉండేది. అందుకే ఆమెకు రవితేజ, ఎన్టీఆర్‌ మహేశ్‌బాబు లాంటి హీరోల సరసన అవకాశాలు వచ్చాయి. పైగా తెలుగుతో పాటు కన్నడ సినిమాలలో కూడా రక్షిత హీరోయిన్ గా ఎదిగింది. అయితే తాజాగా రక్షిత లుక్ చూసి ఇలా అయిపోయిందేమిటి అంటూ ఆమె అభిమానులు షాక్ అవుతున్నారు. పెళ్లి తర్వాత రక్షిత ఇక సినిమాలకు పూర్తిగా దూరమైపోయింది. నటనకు దూరం అయినా జోగయ్య, డీకే రెండు సినిమాలను నిర్మించింది.

ఆ సమయంలో బాగా లావు అయిన ఆమె పిక్స్ బాగా వైరల్ అయ్యాయి కూడా. అయితే, ప్రస్తుతం ఆమె లుక్ మాత్రం అసలు ఎవరూ గుర్తు పట్టని విధంగా మారిపోయింది. ఈమె రక్షితేనా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. అంతగా ఆశ్చర్యపరుస్తోంది రక్షిత న్యూ పిక్. ఇక ఈ అందాల రక్షిత ఇలా మారిపోవడానికి కారణం.. ఆమెకు కొడుకు పుట్టాక థైరాయిడ్‌ సమస్య వచ్చింది. ఆ సమస్య రావడంతోనే బాగా లావెక్కానని రక్షిత ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

సంబంధిత సమాచారం :