రజనీ సినిమాలో నటిస్తున్న మాజీ క్రికెటర్

Published on Jun 21, 2019 1:00 am IST

మురుగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ చేస్తున్న చిత్రం ‘దర్బార్’ షూటింగ్ చివరి దశలో ఉంది. ప్రస్తుత షెడ్యూల్ ముంబైలో జరుగుతోంది. తాజా సమాచారం మేరకు ఈ సినిమాలో మాజీ భారత క్రికెటర్ యోగ్‌రాజ్ సింగ్ నటిసున్నారని తెలుస్తోంది. యోగ్‌రాజ్ అంటే అందరికీ తెలియకపోవచ్చు కానీ స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి అంటే అందరికీ తెలుస్తుంది. క్రికెట్ కెరీర్ ముగించాక సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన యోగ్‌రాజ్ సింగ్ చాలా సినిమాల్లోనే నటించారు.

ప్రస్తుతం రజనీతో కలిసి ‘దర్బార్’ చిత్రంలో కూడా కాసేపు కనిపించనున్నారు. అది కూడా సినిమా ప్రారంభంలో వచ్చే భారీ యాక్షన్ సన్నివేశంలో అని తెలుస్తోంది. అయితే ఆయన పాత్ర పోరాట సన్నివేశానికే పరిమితమా లేకపోతే కథలో కూడా ఇన్వాల్స్ అవుతుందా అనేది తెలియాల్సి ఉంది. లైకా ప్రొడక్షన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తోంది. సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా అనిరుద్ రవిచంద్రన్ సంగీతం సమకూరుస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.

సంబంధిత సమాచారం :

More