అద్భుత సృష్టి ‘బాహుబలి’కి నాలుగేళ్లు

అద్భుత సృష్టి ‘బాహుబలి’కి నాలుగేళ్లు

Published on Jul 10, 2019 3:13 PM IST

2015 జూలై 10 ఇదే రోజున రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘బాహుబలి – ది బిగినింగ్’ విడుదలై యావత్ భారతీయ సినీ ప్రేక్షకుల్ని సంభ్రమాశ్చర్యాలకు, గొప్ప అనుభూతికి గురిచేసి అఖండ విజయాన్ని సాధించింది. అప్పటి వరకు భారతీయ సినీ పరిశ్రమ చూడని రీతిలో వసూళ్ల వర్షం కురిపించిందీ సినిమా. ఈ చిత్రంతో తెలుగు సినిమా స్థాయి ఏమిటో ప్రపంచానికి తెలిసింది. ఈ సినిమా తరవాతే వరల్డ్ సినిమా టాలీవుడ్ మీద దృష్టి సారించిందని చెప్పొచ్చు.

ఒకరకంగా చెప్పాలంటే ఈ చిత్ర నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనినులు చేసింది గొప్ప సాహసమనే అనాలి. ఈ చిత్ర విజయం ఇచ్చిన భరోసాతో అనేకమంది నిర్మాతలు సైతం వందల కోట్ల బడ్జెట్ కేటాయించి సినిమాలు నిర్మించేందుకు ముందుకురావడం మొదలైంది. ఇలా తెలుగు సినిమా పరిశ్రమలోనే కాక, భారతీయ సినీ పరిశ్రమలో పెను మార్పులకు శ్రీకారం చుట్టిన ఈ చిత్రం విడుదలై నేటికి సరిగ్గా నాలుగేళ్లు పూర్తైంది. ఈ సందర్బంగా ఆ చిత్ర దర్శక నిర్మాతలకు, నటీనటులు ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, సత్యరాజ్, రమ్యకృష్ణ తదితరులకు, సాంకేతిక నిపుణులకు మరొక్కసారి 123 తెలుగు.కామ్ తరపున అభినందనలు తెలుపుతున్నాం.

ఇక ఈ చిత్రానికి కొనసాగింపుగా వచ్చిన ‘బాహుబలి -2’ రూ.1650 కోట్ల వసూళ్లతో అనేక రికార్డుల్ని నెలకొల్పి కొత్త చరిత్రనే సృష్టించింది. ఈ చిత్రంతో తెలుగు సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా అంచనాలు, అభిమానులు పెరగడమేకాదు, మార్కెట్ స్థాయి కూడా అమాంతం పెరిగింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు