అల్లు అర్జున్ మూవీ పై ఫ్రాన్స్ కన్సొలేట్ ట్వీట్… !

Published on Nov 9, 2019 7:52 am IST

అలవైకుంఠపురంలో మూవీలో థమన్ స్వరకల్పనలో యంగ్ సింగర్ సిద్ శ్రీరామ్ పాడిన సామజవరగమనా సాంగ్ ఎంత ఆదరణ దక్కించుకుందో తెలిసిన విషయమే. ఇటీవల పాటల చిత్రీకరణ కొరకు ఫ్రాన్స్ వెళ్లిన చిత్ర బృందం మాంట్ సెయింట్ మైకేల్ అనే ఓ అందమైన ప్రదేశంలో ఈ పాటను చిత్రీకరించారు.ఆ పాట చిత్రీకరణ టైములో తీసిన టాప్ టూ బాటమ్ వైట్ ట్రెండీ డ్రెస్ లో అమేజింగ్ పోజ్ ఇచ్చిన బన్నీ స్టిల్ ని విడుదల చేయడం జరిగింది. కాగా ఆ ఫోటో ఉన్న ట్వీట్ ని ట్యాగ్ చేసిన కన్సొలేట్ జనరల్ అఫ్ ఫ్రాన్స్, బెంగుళూరు, మాంట్ సెయింట్ మైకేల్ ప్రాంతంలో షూటింగ్ జరిపిన అలవైకుంఠపురంలో న్యూ పోస్టర్ చూడండి. అలవైకుంఠపురంలో టీమ్ కి వీసాలు జారీచేసినందుకు సంతోషిస్తున్నాం అంటూ ట్వీట్ చేశారు.

దీనికి అల్లు అర్జున్ కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేయడం గమనార్హం. ఇక అలవైకుంఠపురంలో షూటింగ్ చివరి దశకు చేరింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో హీరోయిన్ గా పూజ హెగ్డే నటిస్తుండగా, టబు, సుశాంత్ ఇతర కీలక పాత్రలలో కనిపించనున్నారు. అలవైకుంఠపురంలో వచ్చే ఏడాది జనవరి 12న సంక్రాంతికి విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :

X
More