కొరటాల శివ సినిమా అనగానే కథ కంటే కూడా కథా నేపథ్యమే ఎక్కువగా గుర్తుకొస్తోంది. ఇప్పటివరకు ఆయన తీసిన ప్రతి సినిమాలో బలమైన నేపథ్యం ఉంది. నేపథ్యం చుట్టూ.. ఆ ప్రాంతపు జీవన శైలిని సైతం కొరటాల, తన సినిమాలో చాలా బలంగా చూపిస్తారు. ఐతే, ఇప్పుడు బాలయ్య బాబు – కొరటాల శివ కాంబినేషన్‌లో సినిమా రాబోతుంది. పైగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి బాలకృష్ణ సరికొత్త మేకోవర్‌లో కనిపించబోతున్నాడు. మరి ఈ సినిమా నేపథ్యం ఏమై ఉంటుంది ? అంటూ చర్చ మొదలు అయింది.
కానీ, చాలా రెగ్యులర్ నేపథ్యం అని.. ముఖ్యంగా బాలయ్యకి చాలా కాలంగా కలిసి వస్తోన్న రాయలసీమ నేపథ్యం అని.. రాయలసీమ ప్రాంతంలోని నీటి సమస్య పై ఈ కథ సాగుతుందని తెలుస్తోంది. అన్నట్టు ఆగస్టు నెలలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ఇక రీసెంట్ గా వచ్చిన రూమర్ ప్రకారం.. ఈ సినిమా ఫ్లాష్ బ్యాక్ లో బాలయ్య బాబు పాత్ర మాఫియా నేపథ్యంలో ఉంటుందట. మొత్తానికి ఈ సినిమాలో బాలయ్యను పూర్తిస్థాయి మాస్ అవతార్‌లో చూపించనున్నారు కొరటాల శివ.
పైగా ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానంగా ఉంటాయని తెలుస్తోంది. స్టోరీ కూడా ప్రత్యేకంగా ఉంటుందట. దేవర తర్వాత కొరటాల శివ చేస్తున్న సినిమా కావడంతో.. కథ పై కొరటాల బాగా కసరత్తులు చేశారట. కాగా సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
