అక్కినేని యంగ్ హీరో అఖిల్ ప్రస్తుతం తన లెనిన్ చిత్రాన్ని దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి (నందు) డైరెక్షన్ లో చేస్తున్నాడు. ఈ సినిమా జులై 10వ తేదీన రిలీజ్ కాబోతుంది. రిలీజ్ దగ్గర పడే కొద్దీ మేకర్స్ ప్రమోషన్స్ ను కూడా వేగంవంతం చేస్తున్నారు. ఐతే, లెనిన్ లో ఓ సర్ ప్రైజింగ్ ఎలిమెంట్ ఉందని.. అది ఓ గెస్ట్ రోల్ అని తెలుస్తోంది. మరి ఆ సర్ ప్రైజింగ్ ఎలిమెంట్, లెనిన్ కి ఏ రేంజ్ లో హెల్ప్ అవుతుందో చూడాలి. అక్కినేని ఫ్యాన్స్ మాత్రం కచ్చితంగా థ్రిల్ ఫీల్ అవుతారని అంటున్నారు. అన్నట్టు రీసెంట్ గానే నాగార్జున సలహాలకు అనుగుణంగా క్లైమాక్స్ లో కొన్ని డైలాగ్స్ అండ్ సీన్స్ ను రీషూట్ చేశారు.
కచ్చితంగా నాగార్జున సలహాలు సినిమాకి ప్లస్ అయ్యాయి అని టాక్. కాగా ఈ సినిమాలో అందాల భామ భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా అఖిల్ – భాగ్య శ్రీ కలయికలో లవ్ సీన్స్ చాలా బాగుంటాయట. అన్నట్టు ఈ సినిమా పై అఖిల్ చాలా హోప్స్ పెట్టుకున్నాడు. సినిమా అవుట్ ఫుట్ అయితే బాగా వచ్చిందని టీమ్ చెబుతుంది. మరి ఈ సినిమాతో అఖిల్ హిట్ కొడతాడో లేదో చూడాలి. ఈ సినిమా పై మాత్రం మంచి హైప్ ఉంది.


