డైలాగ్‌ తో సందడి చేసిన బాలయ్య.. గ్రాండ్ ఓపెనింగ్ !

డైలాగ్‌ తో సందడి చేసిన బాలయ్య.. గ్రాండ్ ఓపెనింగ్ !

Published on Jun 25, 2026 10:57 AM IST

బాలయ్య బాబు – కొరటాల శివ కాంబినేషన్‌లో ‘NBK 112’గా ఓ సినిమా రాబోతుంది. ఐతే, నేడు అమరావతిలో ఈ సినిమా పూజా కార్యక్రమాలతో మొదలు అయింది. బాలకృష్ణ అల్లుడు నారా లోకేశ్‌ ముఖ్య అతిథిగా హాజరై క్లాప్‌ కొట్టారు. అలాగే, బాలయ్య చిన్న కుమార్తె తేజస్వీని కెమెరా స్విచ్ ఆన్‌ చేశారు. క్లాప్‌ అనంతరం సినిమా డైలాగ్‌తో బాలకృష్ణ సందడి చేయడం, పైగా ఈ మధ్య కాలంలో బాలయ్య తన సినిమాని ఇంత గ్రాండ్ గా ఓపెన్ చేయడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఇక ఈ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేశ్‌, నిర్మాత సురేశ్‌ బాబుతోపాటు మరికొందరు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.

ఈ సినిమా ఓపెనింగ్ సందర్భంగా నిర్మాత సుధాకర్‌ చెరుకూరి మాట్లాడుతూ.. ఈ చిత్రాన్ని రూ.150కోట్ల నుంచి రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా ఎంటర్‌టైనర్‌గా నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాది ఆగస్టులో రెగ్యులర్‌ షూటింగ్ ప్రారంభించి, 2027 వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నట్లు వెల్లడించారు. కాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన బాలకృష్ణ సరికొత్త మేకోవర్‌లో కనిపించబోతున్నాడు.

అన్నట్టు ఈ సినిమా ఫ్లాష్ బ్యాక్ లో బాలయ్య బాబు పాత్ర మాఫియా నేపథ్యంలో ఉంటుందట. మొత్తానికి ఈ సినిమాలో బాలయ్యను పూర్తిస్థాయి మాస్ అవతార్‌లో చూపించనున్నారు కొరటాల శివ. పైగా ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానంగా ఉంటాయని తెలుస్తోంది. స్టోరీ కూడా ప్రత్యేకంగా ఉంటుందట. దేవర తర్వాత కొరటాల శివ చేస్తున్న సినిమా కావడంతో.. కథ పై కొరటాల బాగా కసరత్తులు చేశారట.

తాజా వార్తలు