మహేష్ ‘స్పైడర్’ సినిమా పై కొత్త అప్డేట్ !


తెలుగు పరిశ్రమ ఈ ఏడాది ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమాల్లో మహేష్ బాబు ‘స్పైడర్’ కూడా ఒకటి. స్టార డైరెక్టర్ మురుగదాస్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం చెననిలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఈ ఏప్రిల్ నెల 20 నుండి హైదరాబాద్లో కొత్త షెడ్యూల్ ను స్టార్ట్ చేయనుంది. క్లైమాక్స్ ఎపిసోడ్, రెండు పాటలు మినహా మిగతా చిత్రీకరణ మొత్తం పూర్తైన ఈ చిత్రం యొక్క టీజర్ ను మే రెండవ వారంలో రిలీజ్ చేసే అవకాశాలున్నాయి.

‘బ్రహ్మోత్సవం’ తర్వాత మహేష్ చేస్తున్న చిత్రం కావడం, ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ కు మంచి స్పందన రావడంతో సినిమాపై అంచనాలు తారా స్థాయికి చేరాయి. మహేష్ సరసన రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటిస్తునం ఈ చిత్రంలో ఎస్. జె. సూర్య ప్రతి నాయకుడి పాత్ర చేస్తుండగా హారీశ్ జైరాజ్ సంగీతం అందిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని జూన్ నెలలో ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో విడుదలచేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.