ఆగష్టు నుండి గజదొంగ మొదలెట్టనున్నాడు !

Published on Jun 4, 2019 3:45 am IST

దొంగాట, కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ చిత్రాల దర్శకుడు వంశీకృష్ణ దర్శకత్వంలో ‘టైగర్ నాగేశ్వర్ రావు’ బయోపిక్ ను నిర్మించాలని నిర్ణయించుకుని ఇప్పటికే రెండు సంవత్సరాలు అయిపొయింది. కానీ ఇప్పటికీ కూడా ఆ బయోపిక్ మాత్రం మొదలవ్వలేదు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా రానున్న ఈ బయోపిక్ త్వరలో మొదలుకాబోతుందని తెలుస్తోంది.

తాజా సమాచారం ప్రకారం ఆగష్టు నుండి షూట్ మొదలుకానుందట. కాగా ఈ బయోపిక్ లో సెన్సేషన్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ను హీరోయిన్ గా తీసుకున్నారని సమాచారం. ఇంతకీ ఎవరు ఈ ‘టైగర్ నాగేశ్వర్రావు’ అని అనుకుంటున్నారా.. ? ఇప్పటి తరానికి ఆయన పెద్దగా తెలియకపోవచ్చు గాని, 1980-90 దశకాల్లో స్టూవర్టుపురం గజదొంగగా టైగర్ నాగేశ్వర్ రావు ఒక భయానక వాతావరణాన్నే సృష్టించారు.

సంబంధిత సమాచారం :

More