“RRR” నుంచీ బాక్సాఫీస్ దద్దరిల్లే సినిమాలన్నీ కొనేశారు.!

Published on Jun 26, 2021 8:02 am IST

అసలు ఈ కరోనా అనేది లేకుంటే మన టాలీవుడ్ నుంచి ఈ ఏడాది వచ్చే సినిమాలకు ఒక్క దక్షణ భారతదేశమే కాకుండా మొత్తం ఇండియన్ బాక్సాఫీస్ నే దద్దరిల్లే సినిమాలు చాలానే వచ్చేసి ఉండేవి. మెగాస్టార్ చిరంజీవి నుంచి నాచురల్ స్టార్ నాని వరకు ప్రతి హీరో నుంచి కూడా సాలిడ్ లైనప్స్ ఉన్నాయి.

అలా మన టాలీవుడ్ లో మంచి మోస్ట్ అవైటెడ్ గా ఉన్న భారీ పాన్ ఇండియన్ సినిమా “RRR” ను మొదలు కొని అఖిల్ మోస్ట్ “ఎలిజిబుల్ బ్యాచులర్” సినిమాల వరకు మంచి బజ్ ఉన్న సాలిడ్ సినిమాల శాటిలైట్ హక్కులు అన్ని ప్రముఖ తెలుగు టెలివిజన్ ఛానల్ స్టార్ మా కొనేసింది.

మరి ఈ లిస్ట్ చూస్తే “RRR”, “పుష్ప”, “సర్కారు వారి పాట”, “అఖండ”, రవితేజ “ఖిలాడి”, నాని “టక్ జగదీష్”, చైతు “లవ్ స్టోరీ”, నితిన్ “మాస్ట్రో”, ఫైనల్ గా అఖిల్ “మోస్ట్ ఎలిజబుల్ బ్యాచులర్” వరకు టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ అండ్ బాక్సాఫీస్ షేక్ చేసే ఆల్ మోస్ట్ అన్ని సినిమాలు వీరు కొనేశారు. ఇక వీరి నుంచి సాలిడ్ ఎంటర్టైన్మెంట్స్ రాబోయే రోజుల్లో కన్ఫర్మ్ అయ్యిపోయింది.

సంబంధిత సమాచారం :