టాలెంటెడ్ హీరోకి టాలీవుడ్ లో ఫుల్ డిమాండ్ !

Published on Apr 11, 2021 6:13 pm IST

“జాతిరత్నాలు” బ్లాక్ బస్టర్ హిట్ తో టాలీవుడ్ లో యంగ్ స్టార్ గా నిలబడ్డాడు నవీన్ పోలిశెట్టి. కరోనా పాండమిక్ టైమ్ లో థియేటర్ల నుంచి దాదాపు రూ. 65 కోట్లు గ్రాస్ రాబట్టి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది నవీన్ నటించిన జాతిరత్నాలు సినిమా. 50 పర్సెంట్ ఆక్యుపెన్సీతో యూఎస్ లో వన్ మిలియన్ డాలర్స్ రాబట్టిన చిత్రంగా కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సూపర్ హిట్ ను వన్ మ్యాన్ షో గా నడిపించిన హీరో నవీన్ పోలిశెట్టికి ఒక్కసారిగా టాలీవుడ్ లో భారీ డిమాండ్ ఏర్పడింది.

“చిచ్చోరే”, “ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ” “జాతిరత్నాలు” ఇలా వరుస విజయాలు ఈ యంగ్ హీరోకు స్క్రిప్ట్ డెసిషన్ మీదున్న పట్టును చూపిస్తున్నాయి. “జాతిరత్నాలు” సినిమా పబ్లిసిటీ కోసం నవీన్ పోలిశెట్టి చేసిన ప్రమోషనల్ వీడియోలు కూడా ఆడియెన్స్ కు సినిమాను బాగా రీచ్ అయ్యేలా చేశాయి. ప్రస్తుతం నవీన్ పోలిశెట్టికి పలు క్రేజీ ఆఫర్లు క్యూ కడుతున్నాయి. పేరున్న నిర్మాతలు ఈ యంగ్ స్టార్ తో సినిమా చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో నవీన్ కు 5 కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ ఇచ్చేందుకు నిర్మాతలు రెడీ గా ఉన్నట్టు సమాచారం.

సంబంధిత సమాచారం :