టాలెంటెడ్ హీరో కోసం యంగ్ డైరెక్టర్స్ కథలు !

Published on Jun 14, 2021 2:02 am IST

“జాతిరత్నాలు” బ్లాక్ బస్టర్ హిట్ తో నవీన్ పోలిశెట్టికి ఫుల్ డిమాండ్ పెరిగింది. ఈ సూపర్ హిట్ ను వన్ మ్యాన్ షో గా నడిపించిన నవీన్ పోలిశెట్టికి ఒక్కసారిగా టాలీవుడ్ లో వరుస అవకాశాలు క్యూ కడుతున్నాయి. “చిచ్చోరే”, “ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ” “జాతిరత్నాలు” ఇలా వరుస విజయాలు ఈ యంగ్ హీరోకు స్క్రిప్ట్ డెసిషన్ మీదున్న పట్టును చూపిస్తున్నాయి.

ప్రస్తుతం నవీన్ పోలిశెట్టికి యంగ్ డైరెక్టర్స్ కథలు చెబుతున్నారట. వెంకీ కుడుముల ఒక కథ చెప్పాడని తెలుస్తోంది. అలాగే రచయిత ప్రసన్న కుమార్ బెజవాడ కూడా నవీన్ కి ఒక కథ చెప్పాడట. నవీన్ తరువాత చేయబోయే రెండు సినిమాల కథలు ఈ రెండేనట. ఎలాగూ పేరున్న నిర్మాతలు ఈ యంగ్ స్టార్ తో సినిమా చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో నవీన్ కు 5 కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ ఇచ్చేందుకు నిర్మాతలు రెడీ గా ఉన్నట్టు సమాచారం.

సంబంధిత సమాచారం :