ఇంకో 10 రోజుల్లో ఎన్టీఆర్ సినిమా పూర్తి వివరాలు !

‘జై లవ కుశ’ విజయం తర్వాత తారక్ త్రివిక్రమ్ శ్రేనివాస్ తో సినిమాకి సైన్ చేశారు. కొన్ని నెలల క్రితమే ఈ చిత్రం అధికారికంగా లాంచ్ అయింది. ఇప్పటికి వరకు అనేక మంది స్టార్ హీరోలతో సినిమాలు చేసిన త్రివిక్రమ్ తొలిసారి ఎన్టీఆర్ తో పనిచేయనుండటంతో ఈ ప్రాజెక్ట్ పై అందరిలోనూ తీవ్ర ఆసక్తి నెలకొంది. అభిమానులైతే సినిమాకు సంబందించిన వివరాల కోసం ఎదురుచూస్తున్నారు.

వాళ్ళ కోసమే ఇంకో పది రోజుల్లో చిత్ర యూనిట్ హీరోయిన్, సినిమాటోగ్రఫర్, సంగీత దర్శకుడు వంటి వారి వివరాలను అధికారికంగా రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రం యొక్క రెగ్యులర్ మార్చి నెలలో ప్రారంభంకానుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ హారికా అండ్ హాసిని క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.