రామ్ సినిమాలో ప్రేమ ఒక్కటే కాదట.. కామెడీ కూడ పుష్కలంగా ఉంటుందట !

రామ్ సినిమాలో ప్రేమ ఒక్కటే కాదట.. కామెడీ కూడ పుష్కలంగా ఉంటుందట !

Published on Jun 19, 2018 10:26 PM IST


ఎనర్జిటిక్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో రామ్ నటిస్తోన్న తాజా చిత్రం ‘హలో గురు ప్రేమ కోసమే’. ఈ చిత్రం సెప్టెంబర్ కల్లా విడుదలవ్వడానికి శరవేగంగా కార్యక్రమాలను పూర్తి చేసుకుంటోంది. కాగా ‘సినిమా చూపిస్తా మావ’ ‘నేను లోకల్’ లాంటి సక్సెస్ ఫుల్ చిత్రాలకు పని చేసిన బృందమే ఈ చిత్రానికి కూడా పని చేస్తోంది. ముఖ్యంగా ఈ చిత్ర రచయిత ప్రసన్న కుమార్ బెజవాడ, దర్శకుడు నక్కిన త్రినాధరావు కాంబినేషన్ పూర్తిగా ఎంటర్టైన్మెంట్ తో కూడుకుని ఉంటుంది.

తాజా సమాచారం ప్రకారం ప్రసన్న కుమార్ రాసిన ట్రీట్మెంట్ మరియు డైలాగ్స్ బాగా వచ్చాయని ‘సినిమా చూపిస్తా మావ, నేను లోకల్’ చిత్రాల్లో కంటే ఈ చిత్రంలో కామెడీ చాలా బాగా పడుతుందని తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్‌ కు జోడిగా అనుపమా పరమేశ్వరన్‌ నటిస్తోంది. దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతమందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు