ఈ ఫ్యూచర్ కొరియోగ్రాఫర్ ఎన్టీఆర్ చేత కూడా స్టెప్ లు వేయిస్తాడేమో !

Published on Jan 5, 2019 6:02 pm IST

స్టార్ హీరోలకు అద్భుతమైన డాన్స్ మూమెంట్స్ కంపోజ్ చేసి.. కొరియోగ్రాఫర్ గా స్టార్ స్టేటస్ సంపాదించుకున్న టాలెంటెడ్ కొరియోగ్రాఫర్ ప్రేమ రక్షిత్. ఇప్పటికే ప్రేమ రక్షిత్ దాదాపు సౌత్ బడా హీరోలందరితోనూ స్టెప్ లు వేయించాడు. కాగా ఇప్పుడు ప్రేమ రక్షిత్ వారసుడు కూడా ప్రేమ రక్షిత్ బాటలోనే నడవనున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. ప్రేమ రక్షిత్ కుమారుడు పరీక్షిత్ కూడా మంచి డాన్సర్ అంటా. తన తండ్రిలానే అతను కూడా భవిష్యత్తులో మంచి కొరియోగ్రాఫర్ అవుతాడని అతని డాన్స్ చూసిన వాళ్ళు అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుతం స్టడీస్ లో ఉన్న పరీక్షిత్ ఇటు చుదువుకుంటూనే.. అటు డాన్స్ పై ప్రత్యేక శ్రద్ద చూపిస్తూ.. ఒక డాన్సర్ గా తనలోని డాన్సర్ ను రోజురోజుకు ఇంప్రూవ్ చేసుకుంటున్నాడట. మొత్తానికి డాన్స్ పై పరీక్షిత్ చూపిస్తున్న ఆసక్తి చూస్తుంటే.. స్టార్ కొరియోగ్రాఫర్ కొడుకు, స్టార్ కొరియోగ్రాఫరే అవబోతున్నాడన్నమాట.

ఇక ప్రేమ రక్షిత్ రాజమౌళి – జూ ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన ‘యమదొంగ’ చిత్రంలో ఎన్టీఆర్ చేత తాను వేయించిన డాన్స్ మూమెంట్స్ కి ప్రేమ రక్షిత్ కి విపరీతమైన పేరు ప్రఖ్యాతలు వచ్చాయి. అలాగే వివి వినాయక్ – జూ ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన ‘అదుర్స్’ సినిమాలో ఎన్టీఆర్ కోసం ప్రేమ రక్షిత్ ప్రత్యేక డాన్స్ మూమెంట్స్ ను కంపోజ్ చేసారు. అందుకే ప్రేమ రక్షిత్ అంటే ఎన్టీఆర్ కు చాలా ఇష్టమంటా. ఆ ఇష్టాన్ని ఎన్టీఆర్ ప్రేమ రక్షిత్ కుమారుడు పరీక్షిత్ మీద కూడా చూపిస్తూ.. అతనితో ప్రత్యేకంగా ఫోటో కూడా దిగాడు. మరి పరీక్షిత్ భవిష్యత్తులో కొరియోగ్రాఫర్ గా మారక ఎన్టీఆర్ చేత కూడా స్టెప్ లు వేయిస్తాడేమో చూడాలి.

సంబంధిత సమాచారం :

X
More